MARTIN LUTHER THE GREAT REFORMER

Martin Luther the Great Reformer

మార్టిన్ లూథర్

[Click here for 95theses; 95 తప్పులను * చ ర్చ నీ య అం శా లు గా]

Martin Luther the Great Reformerమార్టిన్ లూథర్ ; The Protestant Reformation was a major 16th century European movement aimed initially at reforming the beliefs and practices of the Roman Catholic Church. Its religious aspects were supplemented by ambitious political rulers who wanted to extend their power and control at the expense of the Church. The Reformation ended the unity imposed by medieval Christianity and, in the eyes of many historians, signaled the beginning of the modern era. A weakening of the old order was already under way in Northern Europe, as evidenced by the emergence of thriving new cities and a determined middle class.
“In 31st October, 1517, in one of the signal events of western history, Martin Luther, a German Augustinian monk, posted 95 theses on a church door in the university town of Wittenberg. That act was common academic practice of the day and served as an invitation to debate. Luther’s propositions challenged some portions of Roman Catholic doctrine and a number of specific practices.
“The movement quickly gained adherents in the German states, the Netherlands, Scandinavia, Scotland and portions of France. Support came from sincere religious reformers, while others manipulated the movement to gain control of valuable church property.
“The term Protestant was not initially applied to the reformers, but later was used to describe all groups protesting Roman Catholic orthodoxy.”
As the hope of reforming the Roman church faded, the “protestants” were forced to separate from Roman Catholicism resulting in Lutheran churches in Germany, Scandinavia and some eastern European countries, the Reformed churches in Switzerland and the Netherlands, Presbyterian churches in Scotland, and the Anglican church in England, and other diverse elements all of which have evolved into the Protestant denominations of today.

Martin Luther the Great Reformer మార్టిన్ లూథర్

మరణం: 1546 (వయసు 62) ఎయిస్లెబెన్, పవిత్ర రోమన్ సామ్రాజ్యంజననం: నవంబరు 10, 1483 ఎయిస్లెబెన్, పవిత్ర రోమన్ సామ్రాజ్యం

వృత్తి:  ప్రొఫెసర్ & పాస్టర్ ,Theologian & priest
మతం: లూథెరన్ (క్రితం పేరు రోమన్ కేథలిక్)

భార్య: కేథరినా వోన్ బోరా

పిల్లలు: హాన్స్, ఎలిజిబెథ్, మగ్దలీనా, మార్టిన్, పాల్, మార్గరెథ్
తల్లిదండ్రులు: హాన్స్ మరియు మార్గరెథ్ లూథర్ (నెయీ లిండెమన్)

మార్టిన్ లూథర్ (10 నవంబరు, 1483 – 18 ఫిబ్రవరి, 1546) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజం కు చెందిన ఒక ఫాదర్, మరియు చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి. లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, మరియు లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు మరియు పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు. లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత ‘పశ్చాత్తాపం’, మరియు యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసును చేరే మార్గము చర్చిద్వారా మాత్రం కాదు అని చాటిచెప్పాడు.

I. సోలా గ్రేసియా, సోలా ఫైడి, సోలి డియో గ్లోరియా

(Sola Gracia, Sola Fide, Soli Deo Gloria)

                                            – Dr. David Nireekshanarao kurakula.

” మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినదికాదు. దేవుని వరమే. ఎవడును అతిశయపడ వీలులేదు. ” ఎఫెసీ 2:8,9
” నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరమగును. ” సామి 10:7
” క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల లేఖనములను … నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలకడగా ఉండుము.” 2 తిమోతి 3:14,15
అక్టోబర్ మాసం వచ్చిందంటే మహనీయ మతోధ్ధారకుడు రెవ. డాక్టర్ మార్టిన్ లూథర్ ను- శాఖా బేధం లేకుండా- ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసికోవాలి. అదే సమయంలో మహోన్నతుడును, మహా పరిశుధ్ధుడునైన త్రియేక దేవునికి లూథర్ మహనీయుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మనందరికీ అశీర్వాదకరమైన మంచి ఆత్మీయ పరిశ్రమ.

Martin Luther the Great Reformer: మార్టిన్ లూథర్ జీ వి త సం గ్ర హం:

క్రీ. శ. 1483 సంవత్సరం నవంబర్ నెల 10 వ తేదీన జర్మనీ దేశంలోని ఐస్లేబెన్ గ్రామంలో హాన్స్ (యోహాన్ ) మరియు మార్గరెట్ దంపతులకు జ్యేష్ట కుమారునిగా జన్మించిన లూథర్ దేవుని భయభక్తులలో పెంచబడ్డాడు. సార్ధక నామధేయుడయ్యడు. ‘మార్టిన్’ అంటే సైనికుడు అని, ‘లూథర్’ అంటే పవిత్రము అని అర్ధము. లూథర్ అనేది వారి ఇంటి పేరు. లూథర్ ను లాయర్ చేయాలనేది అతని తండ్రి అభీష్టము. అయితే పరమ తండ్రి చిత్తాన్ని బట్టి లూథర్ డాక్టర్ ఆఫ్ హోలీ స్క్రిప్ప్చర్స్ ( Luther preferred to be referred as Doctor of Holy Scriptures ) B.A., M.A.,D.D., పట్టాలు పొందాడు. విటెన్ బర్గ్ లో ప్రీస్ట్ గా అభిషేకం పొంది, వేదాంత కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. దేవునికి ఇష్టుడుగా ఉండగోరి కఠినమైన దీక్షలు, ఉపవాసాలు చేశాడు. అయితే ఆయన ఆత్మలోని అంతర్మథనం పెరుగుతునే ఉందికాని,ఏమాత్రం నెమ్మది కలుగలేదు. రోమ్ నగరం వెళ్ళి పిలాతు మందిరంలో యేసయ్య ఎక్కివెళ్ళిన మెట్లు మోకాళ్ళపై నడుస్తూ ఎక్కి వెళ్ళాడు. వీటిని Scala Sancta ( పవిత్రమైన మెట్లు ) అని పిల్లుస్తారు. చెక్కతో చేయబడిన ఈ మెట్లు యెరూషలేం నుండి రోం నగరానికి తెప్పించబడి జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. లూథర్ అత్యంత భయభక్తులతో ఈ మెట్లు ఎక్కుతూ ఉండగా ‘ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ( రోమా 1:17) అనే వాక్యం ద్వారా పరిశుధ్ధాత్ముడు లూథర్ తో మాట్లాడాడు. వెంటనే లూథర్ హృదయంలో చెప్పశక్యంకాని సంతోషం,సమాధానం కలిగాయి. రక్షణ కేవలం ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసంద్వారా , దేవుని ఉచితమైన కృపను బట్టి మాత్రమే కలుగుతుందని, మానవుని స్వనీతి క్రియల- దాన ధర్మాలు, కఠోర దీక్షలు, ఉపవాసాలు – ద్వారా కలగదని రూఢిగా తెలిసికున్నాడు. ఆ విషయాన్నే ధైర్యంగా ప్రబోధించాడు.

ఆ రోజుల్లో రోమ్ నగరంలో నిర్మాణం ప్రారంభింపబడిన *సె యిం ట్ పీ ట ర్స్ బె సి ల్లి కా *( మహా దేవాలయం ) కొరకు నిధులు అపారంగా సమకూర్చేందుకై ఆనాటి రోమన్ కాథలిక్ సంఘం దేవుని కృపను వ్యాపారంగా మార్చివేసింది. లేఖన విరుద్ధమైన *పా ప ప రి హా ర ప త్రా ల ( Indulgences )* అమ్మకం ప్రారంభించింది. జర్మనీ దేశంలో ఈ పత్రాల అమ్మకంనకు నాయకత్వం వహిస్తున్న *జాన్ టెట్జెల్ (John Tetzel )* బోధలను లూథర్ వ్యతిరేకించాడు. ఈ పధ్ధతి పరిశుద్ధ బైబిల్ గ్రంధపు సందేశానికి విరుద్ధం అని తెగేసి చెప్పాడు. ఆనాటి పోపు సంతకంతో వివిధ ధరల్లో లభించే ఆ పాప పరిహార పత్రికలు – వర్తమాన, భూత, భవిష్యత్ పాపాలను పరిహరిస్తాయిఅని చేయబడే తప్పుడు ప్రచారాలను నిజమే అని నమ్మిన అనేక మంది అమాయక ప్రజలు, అవినీతి పరులైన సంపన్నులు వేలంవెర్రిగా వీటిని కొంటూ ఉంటే, ఈ అక్రమాలకు అసలు కారణం బైబిల్ గ్రంధం ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనని గ్రహించిన లూథర్, అప్పటి వరకు కేవలం లాటిన్ భాషలోనే, సంకెళ్ళలో బంధింపబడిన బైబిల్ గ్రంధాన్ని మొట్టమొదటి సారిగా తన మాతృ భాషయైన జర్మన్ భాషలోనికి అనువదించాడు. *దే వు ని ప్రే మిం చు వా రు అ న గా ఆ య న సం క ల్పం చొ ప్పు న పి లు వ బ డి న వా రి కి స మ స్త ము స మ కూ డి మే లు కై జ రు గు ను ( రోమా 8:28 )* అనే వాక్యపు నెరవేర్పుగా సరిగ్గా అదే సమయానికి *గూటెన్ బర్గ్ ( Gutenberg )* ప్రిటింగ్ ప్రెస్ ను కనుగొనడం, బైబిల్ తమ స్వంత భాషలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఎంతగానో తోడ్పడింది. ఆనాటి కాథలిక్ సంఘపు అచారాల్లోని 95 తప్పులను * చ ర్చ నీ య అం శా లు గా’ ( Points of discussion )* గా వ్ర్రాసి, *1517 అక్టోబర్ 31* వ తేదీన *విటెన్ బర్గ్ దేవాలయపు తలుపులకు మేకులతో కొట్టాడు*. తెల్లవారితే నవంబర్ 1వ తేదీ, అంటే *’స ర్వ ప రి శు ధ్ధు ల ది నం’ (All Saints Day ) * – ఆ రోజున తమ పితరుల సమాధులను దర్శించుకోవడానికి, దేవాలయంలో ప్రార్దనలు చేసికోవడానికి వేలాదిగా ప్రజలు తరలి వస్తారు గనుక, న్యూస్ పేపర్లు, రేడియోలు, టీవీలు లేని ఆ రోజుల్లో విస్తృత ప్రచారం పొందడానికై లూథర్ ఆ రోజును ఎన్నుకున్నాడు. అనుకున్నట్టే వాక్యాధారంగా చేయబడిన లూథర్ సిద్దాంతాలకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. అయితే పోప్ మరియు అతని అనుచరులు కోపోద్రిక్తులయ్యారు. లూథర్ ను బెదిరించారు, సంఘంనుండి బహిష్కరించారు. అయితే లూథర్ తొణక లేదు, బెణకలేదు, తన వాదనను వెనుకకు తీసికోలేదు. *’ HERE I STAND, LORD HELP ME, AMEN!’* అనే మాటలు లూథర్ విశ్వాసానికి, వీరోచిత పోరాటానికి మచ్చుతునకలు. ఆనాటి విజయానికి సజీవ సాక్షాలే నేటి ప్రొటెస్టెంట్ సంఘాలు. ముఖ్యంగా మన లూథరన్ సంఘం! లూథర్ ఫిబ్రవరి 12, 1546 లో ప్రభువు సన్నిధికి చేరాడు. లూథర్ జీవితాన్ని ముచ్చటగా మూడు మాటల్లో చెప్పాలంటే …………

1. A MAN OF CHORALE (CONGREGATIONAL SINGING) : పాటలతో – సంఘమంతా కలసి- ప్రభువుని స్తుతించడానికి ప్రారంభకుడు లూథర్: లూథర్ క్రైస్తవ లోకానికి బైబిల్ తో పాటు ఇచ్చిన మరొక కానుక కీర్తనల (పాటల) పుస్తకం. లూథర్ కు పూర్వం ఏ దేశంలోనైనా క్రైస్తవ ఆరాధనలలో ప్రీస్టులు మాత్రమే, లాటిన్ భాషలోనే పాటలు పాడేవారు. సంఘమంతా కలసి తమ మాతృ భాషలో పాటలతో ప్రభువును ఆరాధించడం లూథరే ప్రారంభించాడు. 1524 లో మొట్టమొదటి కీర్తనల పుస్తకం ప్రచురింపబడింది. ఇందులో కేవలం 8 పాటలే ఉన్నాయి. దీనిలో లూథర్ 4, స్పిరేటస్ అనే వ్యక్తీ 3, పేరు తెలియని 1 మరొకరు రచించారు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులుగా- ఏ శాఖకు చెందినవారైనా- మనం బైబిల్ చదివి, స్తుతి పాటలు పాడుకోగలుగు చున్నామంటే లూథర్ ను బట్టియేనని గట్టిగా తెలిసికొని, ఆ మహనీయుని బట్టి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించాలి. లూథర్ పాటలు వ్రాయడమే కాదు, ఆ పాటలకు సంగీత రాగాలను కుడా సమకూర్చాడు. లూథర్ వ్రాసిన పాటలు మొత్తం 36, అయితే వీటిలో కేవలం 2 మాత్రమే – *మా కర్త గట్టి దుర్గము, నేనమ్ము నాయుధంబు ..* ‘, *’దేవుండవైన యాత్మ రా, నీవారికీవు ప్రీతిగా… *’- ప్రసుతం తెలుగులో చెలామణిలో ఉన్నాయి.

2. A MAN OF PRAYER : ప్రార్ధనాపరుడైన వ్యక్తి లూథర్:
లూథర్ గొప్ప ప్రార్ధనా యోధుడు. ప్రపంచాన్ని పరిపాలించే ఆనాటి పోప్ ను ఒంటరిగా ఎదుర్కోగలిగాడంటే దాని రహస్యం ఆయన ప్రార్ధనా పటిమయే. ఒకసారి లూథర్ భార్య *కాథరిన్ వాన్ బోరా* ( లూథర్ ఆమెను Kati my rib అంటూ ప్రేమగా పిలుస్తూ ఉండేవాడు) ‘ పనులు ఎక్కువున్న రోజున కూడా ఎక్కువ సేపు ప్రార్ధనలో ఎలా ఉండగలుతున్నావు?’ అని అడిగితే, దానికి లూథర్ చెప్పిన జవాబిది. ‘పనులెక్కువ ఉంటే ప్రార్ధన ఎక్కువ అవసరం. అందుకుగాను ఆరోజు తక్కువగా నిద్రపోతాను.’ మనమైతే పనులెక్కువుంటే తక్కువగా ప్రార్ధిస్తాం, ఎక్కువగా నిద్రపోతాం! *”ఓ యీ ని ద్ర బో తా, నీ కే మి వ చ్చి న ది ? లే చి నీ దే వు ని ప్రా ర్ధిం చు!” * ( యోనా 1;5 ) అని అన్యులైన నావికులు యోనాతో పలికిన మాటలు అచేతనమైన క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా లూథరన్ సంఘానికి ఒక మంచి హెచ్చరిక. లూథర్ పేరు పెట్టుకున్నందుకైనా లూథర్ లోని మంచిలక్షణాలలో కొన్నైనా నేర్చుకుందాం!

3. A MAN OF SCRIPTURES : పరిశుధ్ధ గ్రంధాన్నినిష్టగా పఠించిన వ్యక్తి లూథర్:
పరిశుద్ధ లేఖనాలయందు అచంచల విశ్వాసం గలిగి, అపారంగా వాటిని అధ్యయనం చేసిన వ్యక్తి లూథర్. సహచరులతో కలసి వారం వారం బైబిల్ స్టడీలు జరిగించి వాక్యాని క్షుణ్ణంగా పరిశోధించిన వ్యక్తి లూథర్, తమ బైబిల్ స్టడీల గూర్చి వ్రాస్తూ,*’ వాక్యాన్ని అర్ధం చేసికోవడంలో కలిగే వాదోపవాదాలతో అవి కొట్లాటకు కొంచెమే తక్కువగా ఉండేవని’* అని లూథర్ వ్రాశాడు. అంత లోతుగా, నిశితంగా వారు వాక్యాన్ని అధ్యయనం చేసేవారన్న మాట. లూథర్ వలే మనం కూడా వ్యక్తిగత బైబిల్ స్టడీలు, గ్రూప్ బైబిల్ స్టడీలు చేస్తేనే తప్ప ఆయన సాదించిపెట్టిన సంఘ సంస్కరణను తుప్పు పట్టకుండా ఆపలేం! రక్షణకు లూథర్ ఇచ్చిన వాక్యానుసారమైన ( ఎఫేసి 2:8,9 ) నినాదమే ఈ సందేశపు శీర్శికగా పెట్టబడింది.

*’ ర క్ష ణ దే వు ని కృ ప చే త నే, మ న వి శ్వా సం ద్వా రా నే క లు గు తుం ది. మ హి మం తా దే వు ని కే చెం దు తుం ది!* ఆ మాటలు లాటిన్ భాషలో- ఇంగ్లీష్ అక్షరాలో- ఇలా ప్రపంచమంతటా ప్రాచుర్యం చెందాయి. SOLA GRACIA, SOLA FIDE, SOLI DEO GLORIA !

II. కే థ రీ నా *వా న్* బో రా – KATHARINA VON BORA:

Dr. David Nireekshanarao kurakula.

సంఘ సంస్కరణ కర్త మార్టిన్ లూథర్ సతీమణి & ప్రప్రధమ పాస్టరమ్మ గారు. ఒక పురుషుడు తన భార్యను ఎంపిక చేసుకోవడాన్ని బట్టి అతనిని అంచనా వేయగలిగితే, మార్టిన్ లూథర్ కు అత్యధిక మార్కులు వస్తాయి. ఎందుకంటే ఆయన భార్య కేథరీనా వాన్ బోరా ఒక విశిష్టమైన వ్యక్తి. ఆమె 1499 సంవత్సరం జనవరి 29 వ తేదీన ఒక ఉత్తమ వంశానికి చెందిన పేదవాని కుమార్తె గా జన్మించింది. ఐదు సంవత్సరాల ప్రాయంలో ఆమెను కాన్వెంట్ స్కూల్లో చేర్చారు. పదహారు సంవత్సరాల ప్రాయంలో ‘నన్’ గా ఆమె ప్రమాణం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత, మార్టిన్ లూథర్ నాయకత్వంలో నడుస్తున్న’క్రైస్తవ మత సంస్కరణ’ ఉద్యమాన్ని గురించి విని, కాన్వెంట్ లో బంధకాల మధ్యన ఉండే జీవితం పట్ల ఆమె అసంతృప్తి చెందింది. తన వలె అసంతృప్తితో ఉన్న పదకొండు మందితో కలసి, బయటకు రావడానికి లూథర్ సహాయం కోరింది. అతని సహాయం మేరకు వారందరూ చేపలు సప్లై చేసే వర్తకుని బండిలో దాగి ఉండి కాన్వెంట్ నుండి తప్పించుకొని బయటకు వచ్చేశారు.

కేథరీనా విటెన్ బర్గ్ చేరుకుంది. అప్పటికే తాను రేకెత్తించిన విప్లవ ఆలోచనలద్వారా ప్రజలలో పేరు తెచ్చుకున్న మార్టిన్ లూథర్ ను కలిసింది. తనతో వచ్చిన తక్కిన పదకొండుమంది వివాహాలు జరిగేవరకు వేచియుండి, చివరగా తాను ప్రొఫెసర్ & పాస్టర్ మార్టిన్ లూథర్ ను వివాహమాడింది. వీరి వివాహం జూన్ 13, 1525 లో జరిగింది. తద్వారా అభిషిక్తుల వివాహానికి నాంది పలికి, ప్రప్రధమ పాదిరమ్మగారయింది. అప్పటికి కేథరీనా వయస్సు 26, లూథ ర్ వయస్సు 41 సంవత్సరాలు. వీరి వివాహం ప్రేమానురాగాలతో, సంతోషంగా సాగింది. లూథర్ దేవుని వాక్యంలో సాధన చేస్తూవుంటే, కేథరీనా ఇంటి పనులలో తలమునకలుగా ఉండేది. కుటుంబ నిర్వహణ భారం తానే వహించి దానిని ఒక పరిశ్రమ మాదిరిగా నిర్వహించింది. ఇంటి చుట్టూ ఉన్న పొలంలో కూరగాయలు పండిచింది. పాడి పశువులను పెంచి పాలు,పెరుగు,వెన్న తయారు చేసింది. మాంసాహారం కొరకై కోళ్ళు, గొర్రెలు, ఇతర పశువులను పెంచింది. భర్త, తమ ఆరుగురు సంతానంతో పాటు, వారు పెంపకంనకు తెచ్చుకున్న నలుగురు పిల్లలు, లూథర్ వద్ద వేదాంత విద్యనభ్యసించే విద్యార్ధులు, సందర్శకులతో కలిపి ప్రతిరోజూ 20 మందికి తక్కువకాకుండా వారి ఇంట్లో ఉన్న వారందరికీ వంట చేసి వడ్డించేది. అంటు వ్యాధులు ప్రబలిన రోజుల్లో స్థానిక నర్సులతో కలసి వారి ఇంట్లోనే హాస్పిటల్ నిర్వహించేది. ప్రతి ఉదయం 4 గంటలకే లేచి పనులు ప్రారంభించేది. అలా చేస్తేనే తప్ప ఆరోజు పనులన్నీ సక్రమంగా జరిగేవికావు. ఆ మంచి అలవాటును బట్టియే లూథర్ ఆమెను ” వి టె న్ బ ర్గ్ వే కు వ చు క్క” (Morning Star of Wittenberg) అని పిలిచేవాడు.

మంచి విద్యావంతురాలు కాబట్టి భర్తకు పరిచర్యలో కూడా చేదోడు వాదోడుగా ఉండేది. మాతృ భాష జర్మన్ తో పాటు లాటిన్ భాషలో కుడా మాట్లడేది. లూథర్ వ్రాసిన స్తుతి పాటలను శ్రావ్యంగా పాడేది,సంఘానికి నేర్పించేది. లూథర్ స్వభావంలో ఉన్న కొంత కఠినత్వాన్ని మెత్తన చేసింది. లూథర్ మానసికంగా కృంగిన సమయాల్లో మంచి అలోచనలిచ్చి థైర్య పరచేది. ఒకసారి లూథర్ ఎంతో క్రుంగి,కొన్ని దినాలు గడ్డం కూడా చేసుకోకుండా ఉన్నాడు. కేథరీనా ఎన్ని చెప్పినా మార్పులేదు. ఆ పరిస్థితి చూచి ఆమె గబగబా లోపలికి వెళ్లి నల్లని వస్త్రాలను ధరించి లూథర్ దగ్గరకు వచ్చింది. ” ఎవరు చనిపోయారు?”, అడిగాడు లూథర్. ” దేవుడు చనిపోయాడు.” జవాబిచ్చింది కేథరీనా. ” నీకేమైనా బుద్ధుందా? దేవుడెలా చనిపోతాడు ?” అడిగాడు లూథర్. ” ఏమో, గత కొద్ది రోజులుగా మీ వాలకం చూస్తూంటే నాకు అలాగే అనిపించింది. సజీవుడును, సర్వశక్తిమంతుడైన దేవుని సేవకునికి ఇలా ఉండడం తగునా ? !” ప్రశ్నించింది కేథరీనా. ఆ మాటతో లూథర్ తిరిగి థైర్యం తెచ్చుకొన్నాడు. అందుకే లూథర్ కేథరీనాను గూర్చి ఇలా అనేవాడు, ” నేను కొన్ని విషయాల్లో క్రీస్తు కన్నాకేథరీనా మాటలనే వింటానేమో? ఇంటి విషయాల్లో తప్పక ఆమె మాట వింటాను. మిగిలిన అన్ని విషయాల్లో పరిశుధ్ధాత్ముని మాట వింటాను!”

లూథర్ కేథరీనాను ” కేటీ / కిట్టీ మై రిబ్ – KATIE / KITTY MY RIB ” అని ప్రేమతో సంబోధించేవాడు. ఒక్క మాటలో కేథరీనా జీవితాన్ని గూర్చి చెప్పాలంటే, సామెతలు 31:10-31 లో వ్రాయబడిన ‘గుణవతియైన భార్య” పదాలకు జీవం పోస్తే కేథరీనా అవుతుంది. ఆమె జీవితం ప్రతి ఇల్లాలికి, ముఖ్యంగా ప్రతి పాస్టరమ్మ గారికి ఎంతో ఆదర్శనీయం! ఈ ధన్యురాలు 1552 డిసెంబర్ 20 వ తేదీన ప్రభువు సన్నిధికి చేరింది. ఈమె జన్మ దినమైన జనవరి నెల 29 వ తేదీని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ” పాస్టరమ్మ గార్ల ప్రశంసా దినోత్సవం” గా ఏర్పాటు చేసింది.

విటెన్ బర్గ్ లో ఆమె రూపంలో చేయబడిన శిల్పం ఒకటుంది. ఆ శిల్పం చేతి వ్రేలికి ఉన్నఉంగరం అనేక సందర్శకుల చేతుల స్పర్శ వలన పాలిష్ చేసినట్లుగా మారి మెరుస్తూవుంటుంది. ఎందుకంటే ఆ ఉంగరాన్నిగట్టిగా తాకిన వారి వివాహ జీవితాలు విజయవంతమౌతాయి అని ఒక నానుడి ఉంది. చురుకుగా నడుస్తున్న భంగిమలో చేయబడిన ఆ శిల్పాన్ని చూస్తూవుంటే ఆమె తన సంసారాన్నే కాదు, ఒక రాష్ట్రాన్నిలేదా ఒక దేశాన్ని కూడా సమర్ధవంతంగా నడిపించగలదనే భావం ఉట్టిపడుతుంది. ఇంకొక తరంలో అయితే బహుశా అలా అయివుండేదేమో!

కేథరీనా వాన్ బోరా ప్రక్కన లేకుండా ఉంటే మార్టిన్ లూథర్ తన జీవితంలో అంత సాధించి ఉండేవాడా?

Thanks to our Professer Dr. David Nireekshanarao kurakula who worte this artical in Telugu. And also thanks for his permition to post in our website.

Share

Recommended Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

BIBLE QUIZ